Money is All I Want--SuperStar
నేను స్వార్ధపరుడ్ని..కేవలం డబ్బులు కోసమే
ఇండస్ట్రీకి వచ్చాను...ప్రజలకు ఏదో మెసేజ్ ఇవ్వాలని..వారికి సేవ చెయ్యాలని
అస్సలు రాలేదు అంటూ నిక్కిచ్చిగా తెగేసి చెప్పారు తమిళ సూపర్ స్టార్ అజిత్.
ఆయన తన తాజా చిత్రం బిర్లా 2 షూటింగ్ సమయంలోకలిసిన మీడియాతో మాట్లాడుతూ
ఇలా స్పందించారు. అలాగే ఆయన్ని రాజకీయాల్లోకి వస్తారా..మీ తోటి నటలు
వస్తున్నారు కదా అని ప్రశ్నిస్తే.. లేదు నాకు రాజకీయనాయకులు అంటే చాలా
గౌరవం.. వారు గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తారు..
నేను నా సినిమా పాపులారిటిని ఉపయోగించుకుని రాజకీయాల్లోకి రాను... అలాగే
నేను ఎప్పటికీ రాజకీయాల్లోకి రాను.. నేను మంచి పొలిటీషన్ ని కాలేను అని ఆయన
అన్నారు. అలాగే తాను సినిమాలను రిజల్ట్ ను ముందే ఊహించుకుని చెయ్యను అని
అన్నారు. ఇక తన అభిమానులు తన గుండెల్లో ఉంటారని,వారు ఫిల్మ్ క్లబ్ లు
తీసేసినా సరే అని చెప్పుకొచ్చారు. ఇక ఈ చిత్రం తర్వాత తాను పంజా చిత్రం
దర్శకుడు విష్ణు వర్ధన్ తో సినిమా చేస్తానని అన్నారు
0 comments: