phone: +420 776 223 443
e-mail: support@londoncreative.co.uk

"బిజినెస్ మేన్" రీళ్లు దగ్ధం: ఆ మాటమీదే ఉన్నానంటున్న పూరీ


మహేష్ బాబు నటించిన బిజినెస్‌మేన్‌ క్రేజ్‌ అంతకంతకు పెరిగిపోతోంది. ఆ సినిమాపై ఇన్‌డైరెక్ట్‌గా భజరంగ్‌దళ్‌ వారు హైప్‌ తీసుకొస్తున్నారు. సినిమాను సినిమాగా చూడాలి. అందులో నీతులు, సూక్తులు పట్టించుకోవద్దంటూ.. ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసమే సినిమా తీస్తామనీ... 'పిల్లా చావ్‌..' అనే పాట గురించి మాట్లాడినప్పుడు పూరీ వ్యాఖ్యానించారు.

ఇప్పుడు ఆ పాట పెద్ద రాద్దాంతమయింది. ఉస్మానియా యూనివర్శిటీకి దగ్గరలో తార్నకలో ఉన్న థియేటర్‌లో బాక్స్‌ను బయటకు తెచ్చి రీళ్లను తగులబెట్టారు. సికింద్రాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. అయినా.. పూరీ జగన్నాథ్‌ తాను అంతకుముందు మీడియాతో అన్నమాటకు కట్టుబడి ఉన్నానని చెప్పారు.

సినిమానేకాదు.. అందులో వాడేది ప్రతీదీ కాపీనే... అసలు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని కొందరు రాద్దాంతం చేయడం హేయమైన చర్య. మేమూ హిందువులమే.. మాకేమీ దెబ్బతినలేదు... అన్నారు. పైగా... పనీపాటా లేనివాళ్ళు చాలామంది ఉండబట్టే... ఇటువంటి చౌకబారు చర్యలకు పాల్పడుతున్నారంటూ ఘాటుగా విమర్శించారు. ఆ తర్వాత ఈ పరిణామం ఎంతవరకు పోతుందో చూడాలి.

0 comments:

Grab the widget  IWeb Gator
Related Posts Plugin for WordPress, Blogger...